NTV Telugu Site icon

Chapped Lips: పెదవులు పగిలియా? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

Lips

Lips

Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, సహజమైన మాయిశ్చరైజర్లను ఉపయోగించడం, అలాగే ఆయుర్వేద ఆయిల్స్ పెదవులకు ప్రత్యేక శ్రద్ధను ఇచ్చి వాటిని మృదువుగా చేయవచ్చు.

Also Read: Toxic : జనవరి 8న యష్ టాక్సిక్ అప్ డేట్.. ఫోటోతో కన్ఫాం చేసిన మేకర్స్

ఇలా పెదాలను మృదువుగా ఉంచుకుందేకు కొన్ని ఇంటి నివారణలను ఉపయోగిస్తే కొద్దివార్కు మేలుకరంగా ఉంటుంది. ఇంట్లో ఉండే నెయ్యి, వెన్న రెండు మంచి మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. వీటి సహాయంతో పెదవులకు తేమను అందించి, చలికాలంలో వాటిని మృదువుగా ఉంచుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పెదవులపై నెయ్యి లేదా వెన్న రాసుకోవడం మంచిది. అలాగే తేనె సహజమైన హైడ్రేటర్‌గా పనిచేస్తుంది. దీనికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. పెదవులపై తేనె రాసి కొద్దిసేపటి తర్వాత కడిగేయండి. ఇది పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో పెదవులను నయం చేయడంలో సహాయపడతాయి. శీతాకాలంలో కొబ్బరి నూనెను రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు ఉపయోగించడం మంచిది. ఇక అలోవెరా జెల్ చల్లని గుణాలు కలిగి ఉంటుంది. ఇది పెదవుల వాపు, చికాకును తగ్గించి పగుళ్లను నివారిస్తుంది. దీన్ని రోజుకు ఒకసారి పెదవులపై అప్లై చేయడం మంచిది.

Also Read: Telangana Voters: ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల కమిషన్.. పంచాయితీ ఎన్నికల కోసమేనా?

వీటితో పాటు కొన్ని ఆయుర్వేద నివారణలు కూడా పెదవులను సున్నితంగా ఉంచుతాయి. ముఖ్యంగా నువ్వుల నూనె ఆయుర్వేదంలో మంచి మాయిశ్చరైజర్‌గా భావించబడుతుంది. ఇది పెదవులకు లోతైన తేమను ఇస్తుంది. చలికాలంలో పెదవులపై అప్లై చేయడం ద్వారా అవి పొడిబారడం, పగిలిపోవడం వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆల్మండ్ ఆయిల్‌లో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పెదవులను మృదువుగా చేస్తాయి. ఇవి చల్లని వాతావరణం నుండి కాపాడతాయి. రాత్రి పడుకునే ముందు బాదం నూనె రాయడం చాలా ప్రయోజనకరం. అలాగే రోజ్ వాటర్ కూడా చర్మానికి చల్లదనాన్ని, తేమను ఇస్తుంది. కాటన్ బాల్‌తో రోజ్ వాటర్‌ను పెదవులపై అప్లై చేయడం పెదవులకు తేమను ఇస్తుంది. ఇంకా వాటిపై వాపు కూడా తగ్గిస్తుంది.

Show comments