Hombale Films : హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి వంటి దర్శకులతో కలిసి భారీ విజయాలను అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించేందుకు సిద్ధమైంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ స్వయంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ కీలక అడుగు వేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Also Read :Power Peta : రితికా నాయక్‌కు బంపర్ ఆఫర్..
Also Read
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
‘సినిమా అనేది సరిహద్దులు లేని ఒక అనుభూతి. భారత్ నుంచి ప్రపంచానికి మన కథలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విభాగాన్ని ప్రారంభిస్తోంది’ అని సోషల్ మీడియా వేదికగా వారు పేర్కొన్నారు. దీనివల్ల భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు విదేశాల్లో మరింత భారీ స్థాయిలో, పక్కా ప్రణాళికతో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో ‘కాంతార’, ‘సలార్ 2’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా రావడంతో, ఈ సినిమాల వసూళ్లు ఓవర్సీస్ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం తమ సినిమాలే కాకుండా, ఇతర భాషల చిత్రాలను కూడా గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో హోంబలే ఫిల్మ్స్ కేవలం ప్రొడక్షన్ హౌస్‌గానే కాకుండా, ఒక గ్లోబల్ మీడియా పవర్‌హౌస్‌గా అవతరించబోతోంది.
Cinema connects hearts beyond every distance.
From India to the world, our stories travel far and wide.With gratitude and quiet excitement, Hombale Films steps into Overseas Distribution carrying the spirit of Indian cinema beyond borders, across industries, and into hearts… pic.twitter.com/zxKE79FdFL
— Hombale Films (@hombalefilms) February 27, 2026
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!