Mahesh Babu Look: ఎమన్నా ఉన్నాడా.. హాలీవుడ్ మెటీరియల్! మహేష్ బాబు నయా లుక్ అదుర్స్
- ఎస్ఎస్ఎంబీ 29 కోసం మేకోవర్
- లుక్ బయటకు రాకుండా మహేష్ జాగ్రత్తలు
- సూపర్ స్టార్ పూర్తి లుక్ బయటకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu New Look Pics Goes Viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ 29’ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి సినిమాలో మహేశ్ కనిపించనున్నారని టాక్. ఇటీవలి రోజుల్లో మహేష్ తన నయా లుక్‌ను బయటకు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈవెంట్స్, వెకేషన్లకు వెళ్లినప్పుడు కూడా తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ పూర్తి లుక్ బయటకు వచ్చేసింది.
నేడు మహేష్ బాబు తన సతీమణి నమత్రతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ప్రకటించిన రూ.50 లక్షల విరాళం చెక్‌ను సీఎంకు అందజేశారు. ఇందుకు సంబంధించిన పోటోలను తెలంగాణ సీఎంఓ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్ టీషర్ట్, జీన్స్ వేసుకున్నారు. పొడవాటి జుత్తు, గడ్డంతో మహేశ్ నయా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘మహేష్.. ఎమన్నా ఉన్నాడా’, ‘అన్న హాలీవుడ్ మెటీరియల్’ అంటూ నయా లుక్‌పై ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
Also Read: Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. మరో 10 లక్షల విరాళం!
మహేశ్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ‘గరుడ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్. దుర్గా ఆర్ట్స్‌పై కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..