Site icon NTV Telugu

Holding Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే ఎంతటి డేంజరో తెలుసా?

New Project (23)

New Project (23)

Holding Urine : మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు. కానీ ఎక్కువ కాలం మూత్రాన్ని ఆపడం వల్ల 15 శాతం మందికి ప్రోస్టేట్, కిడ్నీల్లో రాళ్లు, మూత్రపిండాల సమస్యలు, పైల్స్ వంటి సమస్యలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. చాలా మంది బలవంతంగా మూత్రాన్ని నియంత్రిస్తుంటారు. కానీ మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మూత్రాశయంలో తీవ్రమైన సంక్రమణకు కారణమవుతుంది. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం సంచిలా కనిపిస్తుంది. అలాగే ఇది కిందికి జారిపోతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా విడుదల కాదు. కొన్నిసార్లైతే మూత్రాశయం కూడా పగిలిపోవచ్చు.

Read Also: Health Tips: ఇలా చేస్తే ఏడు రోజుల్లో ఎంత కొవ్వు అయినా ఇట్టే కరిగిపోవాల్సిందే

మూత్రాశయంలో ఎక్కువ కాలం మూత్రం పేరుకుపోయినప్పుడు.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య కూడా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపే వ్యక్తులు మూత్రం పోసేటప్పుడు నొప్పి కలుగుతుంది. మూత్రాశయం ఎక్కువ సేపు మూత్రంతో నిండి ఉంటే.. మూత్రాశయం బలహీనంగా మారుతుంది. అలాగే దాని బయటి పొర పలుచగా మారుతుంది. గర్భిణులు మూత్రాన్ని ఆపడం కష్టమవుతుంది. దీనివల్ల మూత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మూత్రాశయంతో మూత్రం నిండితే గర్భంలో ఒత్తిడి పెరుగుతుంది. ఏడాది లోపు వయసున్న పిల్లలు ప్రతి గంటకు మూత్ర విసర్జన చేయాలి. ఎందుకంటే వారికి మూత్రాశయం చాలా చిన్నగా ఉంటుంది. ఈ కారణంగానే వాళ్లు త్వరగా మూత్ర విసర్జన చేస్తారు. అయితే కాలక్రమేణా పిల్లలు రోజుకు 10 నుంచి 12 సార్లు టాయిలెట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక పెద్దల విషయానికొస్తే.. వీల్లు రోజుకు 6 సార్లు మూత్ర విసర్జన చేయాలి. ఇందుకోసం రోజూ పుష్కలంగా నీటిని తీసుకోవాలి. 

Read Also: LIC Jeevan Arogya Policy : ఈ కార్డు ఉంటే.. హాస్పిటల్ బిల్ కట్టే పనేలేదు

Exit mobile version