Site icon NTV Telugu

భారత మార్కెట్‌లో HMD కొత్త HMD 100, HMD 101 ఫీచర్ ఫోన్లు లాంచ్.. ఫీచర్లు ఇవే..!

Hmd

Hmd

HMD 100, HMD 101: HMD సంస్థ భారత ఫీచర్ ఫోన్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ రెండు కొత్త 2G మోడళ్లను విడుదల చేసింది. HMD 100, HMD 101 పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కాంపాక్ట్ మొబైల్స్. ఈ రెండు ఫోన్లు 1.77 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉన్నాయి. HMD 100 సాధారణ, బలమైన డిజైన్‌ను కలిగి ఉండి రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. ఇది 800 mAh రిమూవబుల్ బ్యాటరీపై పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల స్టాండ్‌బై, 6 గంటల టాక్‌టైమ్ అందిస్తుంది. కాల్స్, మెసేజ్‌లు, వైర్‌లెస్ FM రేడియో, టార్చ్, Text-to-Speech వంటి ప్రాథమిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Sumalatha Johnny Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం..!

HMD 101 మరింత ఆధునిక రూపకల్పనతో పెద్ద కీప్యాడ్‌తో వస్తుంది. ఇందులో వైర్‌లెస్ FM రేడియోతో పాటు MP3 ప్లేయర్, మైక్రో SD కార్డ్ సపోర్ట్, Snake గేమ్ వంటి వినోద ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 1000 mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తూ 8 నుండి 9 రోజుల స్టాండ్‌బై, 7 గంటల టాక్‌టైమ్ అందిస్తుంది.

HMD 100 & HMD 101 స్పెసిఫికేషన్లు:
• డిస్‌ప్లే: 1.77 ఇంచులు, 160×128 రిజల్యూషన్
• ప్రాసెసర్: Unisoc 6533G
• OS: S30+
• RAM/స్టోరేజ్:
– HMD 100: 8 MB RAM / 4 MB స్టోరేజ్
– HMD 101: 4 MB RAM / 4 MB స్టోరేజ్
• స్టోరేజ్ విస్తరణ: HMD 101 – 32 GB వరకూ MicroSD
• బ్యాటరీ:
– HMD 100 – 800 mAh
– HMD 101 – 1000 mAh
• ఇతర ఫీచర్లు: FM రేడియో (wired & wireless), టార్చ్, Text-to-Speech, 3.5 mm జాక్
• రిటైల్ బాక్స్‌లో: ఛార్జర్, బ్యాటరీ, సేఫ్టీ బుక్లెట్

ధరలు :
• HMD 100 గ్రే వెర్షన్ ధర రూ. 949 (MRP రూ. 1,099), రెడ్ వెర్షన్ ధర రూ. 999 (MRP రూ. 1,149)
• HMD 101 గ్రే, బ్లూ రంగుల్లో రూ. 1,049 (MRP రూ. 1,199)

Thailand: థాయిలాండ్‌‌కు వెళ్తున్నారా.. ఇవి లేకపోతే నో ఎంట్రీ జాగ్రత్త!

ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం HMD.com లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రముఖ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా లభ్యం కానున్నాయి.

Exit mobile version