HMD 100, HMD 101: HMD కొత్త ఫీచర్ ఫోన్లు విడుదల.. రూ. 1000 కంటే తక్కువ ధరకే
- HMD కొత్త ఫీచర్ ఫోన్లు విడుదల
- HMD 100, HMD 101 లను భారత మార్కెట్లో విడుదల
- HMD 100, HMD 101 ధర రూ.949
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్స్ హల్ చల్ చేస్తున్నప్పటికీ ఫీచర్ ఫోన్ల వాడకం మాత్రం ఆగిపోలేదు. ఇప్పటికీ చాలా మంది ఫీచర్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ఫీచర్ ఫోన్లలో కూడా అద్భుతమైన ఫీచర్స్ ఉండడంతో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా HMD తన కొత్త ఫీచర్ ఫోన్లు, HMD 100, HMD 101 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1,000 కంటే తక్కువ ధర కలిగిన ఈ ఫోన్లు మన్నిక, సరళమైన ఇంటర్ఫేస్, పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. HMD 100, HMD 101 1.77-అంగుళాల డిస్ప్లేలను కలిగి ఉన్నాయి.
HMD 100, HMD 101 ధర
Also Read
- ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
HMD 100, HMD 101 ధర రూ.949 గా కంపెనీ నిర్ణయించింది. రెండు ఫీచర్ ఫోన్లు డిసెంబర్ 5, 2025 నుంచి HMD అధికారిక సైట్, ఇ-కామర్స్ సైట్లు, ప్రముఖ రిటైల్ షాప్స్ ద్వారా సేల్ కు అందుబాటులో ఉంటాయి.
HMD 100 ఫీచర్లు
HMD 100 160×128 పిక్సెల్స్ రిజల్యూషన్, 4:5 యాస్పెక్ట్ రేషియోతో 1.77-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది S30+ పై రన్ అవుతుంది. HMD 100 అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ 1-సంవత్సరం రీప్లేస్మెంట్ వారంటీని అందిస్తుంది. ఇది బూడిద, నీలి, ఎరుపు రంగులలో వస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, ఇది 800mAh బ్యాటరీని కలిగి ఉంది. డ్యూయల్ LED ఫ్లాష్‌లైట్, వైర్లెస్ FM, ఫోన్ టాకర్, 10 భారతీయ భాషలకు ఇన్పుట్ సపోర్ట్, 23 భారతీయ భాషలకు రెండరింగ్ సపోర్ట్ ఉన్నాయి.
HMD 101 ఫీచర్లు
HMD 101 1.77-అంగుళాల డిస్ప్లేను 160×128 పిక్సెల్‌ల రిజల్యూషన్, 4:5 యాస్పెక్ట్ రేషియోతో కలిగి ఉంది. ఇది ఇన్ బిల్ట్ MP3 ప్లేయర్, వైర్లెస్ FM రేడియోను కూడా కలిగి ఉంది. ఫోన్ స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. ఇది S30+లో రన్ అవుతుంది. ఈ ఫోన్లో డ్యూయల్ LED ఫ్లాష్‌లైట్, ఆటో కాల్ రికార్డింగ్, ఫోన్ టాకర్, 10 భారతీయ భాషలకు ఇన్పుట్ సపోర్ట్, 23 భారతీయ భాషలకు రెండరింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ వినోదం, కాల్స్, టెక్స్ట్ మెసేజ్ ల సమయంలో సహాయపడతాయి. ఈ ఫోన్‌తో కంపెనీ 1-సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారెంటీని అందిస్తుంది.
తాజావార్తలు
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!