రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 26న జమ్మూకశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేశామని ఉగ్రవాది జావేద్ మట్టూ తెలిపాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. హిజ్బుల్ ముజాహిదీన్ A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఈ నెల జనవరి 4న అరెస్టయ్యాడు. కాగా.. అతన్ని పోలీసులు విచారించగా, ఈ విషయం బయటపడింది.
Read Also: Heroine: పిచ్చిదానిలా పిచ్చి చూపులు చూస్తున్న ఈమె.. ఇప్పుడు టాప్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
అంతేకాకుండా.. మరిన్ని భయంకరమైన విషయాలను పోలీసుకు చెప్పాడు. ఏడాది కాలంగా భారత్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు టెర్రరిస్ట్ మట్టు చెప్పాడని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఏడాది క్రితం జావేద్‌ను పాకిస్థాన్ నుంచి నేపాల్‌కు పంపించారని.. మట్టూ కూడా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ద్వారా నేపాల్‌లోని పోఖారాలో మకాం వేశాడు.
Read Also: Chandrababu: పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజాసేవ
మరోవైపు.. ఉగ్రవాది మట్టు పాకిస్థాన్‌లో ఉన్న ఇద్దరు మధ్యవర్తులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. వారు ఒక ముఖ్యమైన పనిని నిర్వహించడానికి అతనిని ప్రేరేపిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న తన యజమానుల ఆదేశాల మేరకు జావేద్ మట్టూ జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడి చేయాలని భావించాడని పోలీసులు చెప్పారు.