Site icon NTV Telugu

Sailesh Kolanu: “నా సినిమా సేఫ్..” కోర్ట్ సినిమాపై ‘హిట్‌ 3’ దర్శకుడు ఆసక్తికర పోస్ట్‌..

Sailesh Kolanu

Sailesh Kolanu

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు మంచి సక్సెస్‌ను అందించాయి. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు.. “ఈ సినిమా ఈవెంట్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చకపోతే నేను హీరోగా నటించే హిట్ 3 చూడవద్దు” అంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి, శివాజీ ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం మార్చి 14వ తేదీన రిలీజ్ కావలసి ఉండగా రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. ఒకటి సెలబ్రిటీ స్పెషల్ కాగా మరొకటి మీడియా కోసం ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమాపై హిట్‌ 3 దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్‌ పంచుకున్నారు. కోర్ట్ సినిమా మార్చి 14న తెరపైకి రానుంది. దీని పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ ప్రదర్శించగా.. ప్రేక్షకారణతో హిట్ టాక్‌ సొంతం చేసుకుందని పేర్కొన్నారు.

READ MORE: SpaDeX mission: మరో ఘనత సాధించిన ఇస్రో.. డీ-డాకింగ్ వీడియో వైరల్..

శైలేష్ కొలను ‘మిర్చి’లో ప్రభాస్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. ‘‘నా సినిమా సేఫ్‌ (హిట్‌ 3)” అని రాసుకొచ్చారు. ” కోర్ట్‌ సినిమా భావోద్వేగాలతో కూడింది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఈ చిత్ర యూనిట్‌కు నా అభినందనలు.” అని రాసుకొచ్చారు. ప్రియదర్శి మరో హిట్ కొట్టావు. నా ‘హిట్ 3’ సినిమా ఎడిట్‌ రూమ్‌కు వెళ్తుంది. అందరు తప్పక కోర్ట్ సినిమాను వీక్షించండి.’’ అని పోస్ట్‌ లో పేర్కొన్నారు. కోర్ట్ సినిమాకు హిట్‌ టాక్ వచ్చింది కాబట్టి తన హిట్టు-3 సినిమా సేఫ్ అనే కోణంలో ప్రభాస్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు శైలేష్ కొలను.

Exit mobile version