Site icon NTV Telugu

Hit 2: కొడుకుతో కలిసి హిట్ 2చూసిన బాలయ్య.. టీంలో సెల్ఫీ వైరల్

Balyya

Balyya

Hit -2 : అడివి శేషు హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిగా నటించిన హిట్-2 సినిమా సక్సెస్ ట్రాక్ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. హిట్ యూనివర్సల్ సెకండ్ కేసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా హిట్-1 అందర్నీ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను నిర్మించాడు. హీరో అడవి శేషు కెరీర్ లోనే ప్రారంభంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా హిట్ 2 నిలిచింది.

Read Also: Santosham Film Awards: ‘సంతోషం’లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ

కాగా, ఈ సినిమాను యువరత్న బాలకృష్ణ, అయన తనయుడు మోక్షజ్ఞ ఇవాళ వీక్షించారు. ఈ విషయాన్ని అడివి శేషు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. “బాలకృష్ణ గారికి మరియు మోక్షజ్ఞకు హిట్-2 సినిమా చాలా బాగా నచ్చింది. ఇక నా యాక్టింగ్, శైలేష్ కొలను దర్శకత్వానికి బాలకృష్ణ గారు ఇచ్చిన కంప్లిమెంట్స్ మర్చిపోలేనివి” అంటూ పోస్ట్ చేయారు. అంతేకాదు హిట్ యూనివర్స్ బాలయ్యని కూడా భాగం కావాలని అడివి శేషు కోరగా.. బాలకృష్ణ నవ్వుతో సమాధానం చెప్పినట్లు తెలిపాడు. సినిమా చూసిన తరువాత బాలయ్య, మోక్షజ్ఞ మూవీ టీమ్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version