Site icon NTV Telugu

Hit And Run: మాదాపూర్‌లో హిట్ అండ్ రన్.. ట్రాఫిక్ హోమ్ గార్డ్‌ను ఢీకొట్టి పరారీ అయిన కారు డ్రైవర్

Hit And Run

Hit And Run

Hit And Run: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. మాదాపూర్ పర్వత నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ నయీం (45)ను ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టి పరారైంది. ఘటనలో నయీం తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం నయీం కాలు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Deepti Sharma: నం.1 బౌలర్ అంటే ఆ మాత్రం ఉంటది.. వరల్డ్ రికార్డ్ సాధించిన దీప్తి శర్మ..!

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్ అదనపు డీసీపీ హనుమంత్ రావు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న హోమ్ గార్డ్ నయీంను పరామర్శించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్‌స్వీప్..!

Exit mobile version