Ind vs SL 5th T20I: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఛేదన మొదట్లో భారత జట్టు కష్టాల్లో పడినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయాన్ని అందించింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు పోరాడినా, కీలక సమయంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి విజయం సాధించారు. దీంతో టీమిండియా సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
Youth Risks Reels: మరీ ఇదేం పిచ్చిరా నాయనా..! రీల్స్ కోసం ఏకంగా..
టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలి 3 వికెట్లను కేవలం 41 పరుగులకే కోల్పోయింది. అలాగే 77 పరుగుల వద్దే సగం జట్టు పెవిలియన్ చేరింది. ఈ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యత తీసుకుని జట్టును ఆదుకుంది. ఆమె 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 68 పరుగులు చేశారు. ఆమెకు తోడుగా అరుంధతి రెడ్డి 11 బంతుల్లో 27 పరుగులు చేయగా, అమంజోత్ కౌర్ 21 పరుగులు జోడించారు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలింగ్‌లో కవిషా దిలహారి 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. రష్మిక సేవ్వండి, చమరి అటపట్టు తలా 2 వికెట్లు సాధించారు. నిమాషా మీపేజ్ 1 వికెట్ తీసింది.
సాక్షి అగర్వాల్ మ్యాజిక్.. ఈ లుక్ చూసి అందరూ ఫిదా అవ్వాల్సిందే!
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మొదట్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ చమరి అటపట్టు కేవలం 2 పరుగులకే అవుట్ కాగా.. ఆ తర్వాత హసిని పెరెరా, ఇమేషా దులానీ అద్భుతంగా ఆడి శ్రీలంకకు ఆశలు కల్పించారు. ఇమేషా దులానీ 39 బంతుల్లో 50 పరుగులు (8 ఫోర్లు) చేయగా, హసిని పెరెరా 42 బంతుల్లో 65 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్) చేశారు. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టడి చేయడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌ను 15 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ మొత్తం 6 మంది బౌలర్లను వినియోగించగా.. అందరూ ఒక్కో వికెట్ తీశారు. దీప్తి శర్మకు టీ20 అంతర్జాతీయాల్లో 152వ వికెట్ తీయగా.. దీనితో ఆమె మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు.