Deepti Sharma: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్, భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో టీమిండియా 15 రన్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తూ, ప్రపంచకప్ గెలిచిన ఏడాదిని భారత్ ఘనంగా ముగించింది.
Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్‌స్వీప్..!
టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఈ కీలక సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యత తీసుకున్నారు. ఆమె 43 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. సిరీస్‌లో ఆమెకు ఇదే తొలి అర్ధశతకం కావడం విశేషం. అరుంధతి రెడ్డి 11 బంతుల్లో 27 పరుగులు, అమంజోత్ కౌర్ 21 పరుగులు జోడించడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలింగ్‌లో కవిషా దిలహారి, రష్మిక సేవ్వండి, చమరి అటపట్టు తలా రెండు వికెట్లు సాధించగా, నిమాషా మీపేజ్ ఒక వికెట్ తీసింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీప్తి శర్మ (1/28), వైష్ణవి శర్మ (1/33) పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి సృష్టించారు. వికెట్లు వరుసగా పడటంతో శ్రీలంక చివరి ఓవర్లలో కావాల్సిన భారీ ఫినిష్ ఇవ్వలేకపోయింది. దీనితో 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దీప్తి శర్మ. 14వ ఓవర్‌లో నీలాక్షిక సిల్వాను ఎల్బీడబ్ల్యూ ద్వారా అవుట్ చేసిన దీప్తి, మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇది దీప్తి శర్మకు టీ20 అంతర్జాతీయాల్లో 152వ వికెట్. 134 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి, ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ (151 వికెట్లు) రికార్డును అధిగమించింది. ప్రస్తుతం దీప్తి శర్మ టీ20 లలో నం.1 బౌలర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.