NTV Telugu Site icon

ICC Champions Trophy: ఇప్పటి వరకు ఏ జట్టు ఎన్ని సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాయంటే!

Icc Champions Trophy

Icc Champions Trophy

ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరకు చేరుకుంది. కప్పు కోసం మార్చి 9న దుబాయ్ వేదికగా భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. గ్రూప్ స్టేజి ఓటమి ప్రతీకారానికి న్యూజిలాండ్ ఎదురు చూస్తోంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎంత ప్రమాదకర జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, కప్ గెలవాలంటే మాత్రం ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపే సమయం వచ్చేసింది.

Read Also: Supreme Court: సుప్రీంకోర్టుకి చేరిన తమిళనాడు ‘‘హిందీ’’ వివాదం..

ఇకపోతే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) 1998లో ప్ర‌వేశ‌పెట్టారు. అప్ప‌ట్లో దీన్ని “ఇంట‌ర్నేష‌న్ క‌ప్” అని పిలిచేవారు. ఆ తర్వాత 2000 ఏడాదిలో దీని పేరును ‘ఐసీసీ నాకౌట్ టోఫ్రీ’గా మార్చేశారు. ఆ తర్వాత మరోసారి 2002లో ‘ఛాంపియ‌న్స్ ట్రోఫీ’గా నామ‌క‌ర‌ణం చేయగా.. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే పేరుతో ట్రోఫీ కొన‌సాగుతోంది. 1998లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్, వన్డే ఫార్మాట్‌లో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. ప్రతి సిరీస్‌కి విభిన్న దేశాలు ఆతిథ్యం ఇవ్వగా, అత్యద్భుత ప్రదర్శనలు కనబరిచిన జట్లు ఈ కప్‌ను గెలుచుకున్నాయి. మరీ ఏ జట్టు ఎన్ని సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించిందో పూర్తి వివరాలు చూద్దామా..

Read Also: GlocalMe PetPhone: మనుషులకే కాదు.. ఇకపై పెంపుడు జంతువులకూ ఫోన్

* 1998: ప్రధమ టోర్నమెంట్, “విల్స్ ఇంటర్నేషనల్ కప్” (Wills International Cup) పేరుతో బంగ్లాదేశ్‌లో జరిగింది. దానిలో సౌతాఫ్రికా (South Africa) జట్టు విజేతగా నిలిచింది.

* 2000: రెండవ సీజన్ కెన్యాలో (Kenya) జరిగింది. ఈసారి న్యూజిలాండ్ (New Zealand) జట్టు టైటిల్‌ను గెలుచుకుంది.

* 2002: శ్రీలంక (Sri Lanka)లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంక జట్లు సంయుక్తంగా విజేతలుగా నిలిచాయి.

* 2004: ఇంగ్లాండ్ (England) ఆతిథ్యమిచ్చిన ఈ సీజన్‌లో వెస్టిండీస్ (West Indies) జట్టు ట్రోఫీని దక్కించుకుంది.

* 2006: భారతదేశం (India)లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా (Australia) జట్టు విజేతగా నిలిచింది.

* 2009: దక్షిణాఫ్రికా (South Africa)లో జరిగిన ఈ సీజన్‌లో కూడా ఆస్ట్రేలియా (Australia) జట్టు టైటిల్‌ను గెలుచుకుని తన సత్తా చాటింది.

* 2013: ఇంగ్లాండ్ (England)లో జరిగిన ఈ సీజన్‌లో భారత జట్టు (India) అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను సాధించింది.

* 2017: మళ్లీ ఇంగ్లాండ్ (England)లోనే జరిగిన ఈ సీజన్‌లో పాకిస్తాన్ (Pakistan) జట్టు విజయఢంకా మోగించింది.

* 2025: పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ సీజన్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.