Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News History Of Indian Rupee As Official Currency In Gulf Countries

Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!

Published Date :March 31, 2026 , 5:33 pm
By Shiva Ganesh
  • 1947 తర్వాత రెండు దశాబ్దాల పాటు అరబ్, గల్ఫ్ దేశాలలో రూపాయి హవా
  • దినార్, రియాల్ కంటే ముందు అధికారిక కరెన్సీగా ఇండియన్ రూపాయి
  • 1966లో రూపాయి స్థానంలో దినార్, రియాల్ ఎంట్రీ
Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indian Rupee: భారత దేశ చరిత్రను పరిశీలిస్తే.. దేశ వైభవం ఏంటో నేటి తరానికి అర్థం అవుతుంది. ఒకప్పుడు మన ఇండియన్ రూపాయి.. పలు ముస్లిం దేశాలకు అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యేదని మీలో ఎంత మందికి తెలుసు. ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేవి. ఆ రోజుల్లో ఈ దేశాలను భారతదేశపు ఖజానా రాష్ట్రాలు అని పిలిచేవారు. ఒక విధంగా చెప్పాలంటే, ఆనాడు ఇండియా ఈ ముస్లిం దేశాలకు పాలనా పరమైన ప్రధాన కార్యాలయంగా పనిచేసిందని చెప్పాలి. ఈ ముస్లిం దేశాలకు ఆనాడు రూపాయే అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యింది. అయితే తర్వాత ఎలా మన రూపాయి స్థానంలో దినార్, రియాల్ వచ్చాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

అధికారిక కరెన్సీగా రూపాయి..
బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశం – భారత్ – పాకిస్థాన్‌గా విడిపోయి స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని నెలల ముందు, ఏప్రిల్ 1, 1947న దుబాయ్ నుంచి కువైట్ వరకు ఉన్న గల్ఫ్ దేశాలు ఇండియా నుంచి విడిపోయాయి. ఈ గల్ఫ్ దేశాలు భారత్ నుంచి అధికారికంగా విడిపోయినప్పటికీ, చాలా ఏళ్ల పాటు ఈ దేశాలలోని అనేక విషయాలలో ఇండియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉండేది. ఈ దేశాలు భారత్ నుంచి విడిపోయిన తర్వాత కూడా, ఆయా దేశాల్లో భారత రూపాయిని కరెన్సీగా చాలా సంవత్సరాల పాటు ఉపయోగించారు. 1947 నుంచి 1966 వరకు, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, బహ్రెయిన్, కువైట్‌లలో భారత రూపాయిని ఉపయోగించారు. ఈ దేశాలలో చాలా వరకు 1966 నాటికి పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందాయి. ఆ సమయంలో, ఈ దేశాలలో కరెన్సీగా దినార్, రియాల్‌ను ఉపయోగించలేదు. భారత రూపాయి వారి అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యేది.

బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, ఈ దేశాలు భారత కరెన్సీని తమ అధికారిక కరెన్సీగా ఉపయోగించాయి. ఎందుకంటే బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు ఈ దేశాలలో భారత రూపాయి కరెన్సీగా ఉపయోగించే వారు. అందుకని ఈ గల్ఫ్ దేశాలు భారతదేశం నుంచి విడిపోయి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, భారత రూపాయినే తమ అధికారిక కరెన్సీగా కొనసాగించింది. ఆ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశాల కోసం ప్రత్యేకంగా కరెన్సీని కూడా ముద్రించింది. ఈ దేశాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ సమయంలో ప్రత్యేక గులాబీ రంగు నోట్లను ముద్రించేది. ఈ కరెన్సీగా Z1 సిరీస్ అని పిలిచేవారు. సౌదీ అరేబియాకు సొంతంగా నోట్లు ముద్రించుకునే అవకాశం ఉన్నప్పటికీ, భారత రూపాయి విలువ, హోదా కారణంగా తమ అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యేలా చూసుకుంది. ఆ సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హజ్ యాత్రికుల కోసం HA సిరీస్‌లో ప్రత్యేక నోట్లను కూడా ముద్రించింది. వీటిని అప్పుడు హజ్ రూపాయలు అని పిలిచేవారు.

దెబ్బ కొట్టిన చైనా యుద్ధం..
ఆ తర్వాత 1960వ దశకంలో, చైనాతో యుద్ధం, ఆపై పాకిస్థాన్‌తో యుద్ధం, ఆ సమయంలో ఇండియాలో సంభవించిన కరువు పరిస్థితి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఆ సమయంలో దేశ జీడీపీ పడిపోతుందనే భయంతో గల్ఫ్ దేశాలు తమ సొంత కరెన్సీలను ప్రవేశపెట్టాయి, దీంతో 1966లో రూపాయి స్థానంలో దినార్, రియాల్ వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. 1947 తర్వాత రెండు దశాబ్దాల పాటు అరబ్, గల్ఫ్ దేశాలలో భారత రూపాయి తన ప్రాబల్యాన్ని కొనసాగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ 30 అరబ్ దేశాలను బ్రిటిష్ రెసిడెంట్లు పాలించారు. ఈ దేశాల ఆర్థిక నిర్మాణం భారతదేశంతో ఎంతగా పెనవేసుకుపోయిందంటే, వీటికి స్వాతంత్ర వచ్చినా రూపాయిని అకస్మాత్తుగా వదిలివేయడం సులభం కాలేనంతగా పెనవేసుకొని పోయాయి. ఆ సమయంలో, ఈ దేశాలలో ఆధిపత్యం చెలాయించిన బ్రిటిష్ ఇండియా లైన్ (షిప్పింగ్ కంపెనీ) అత్యంత అనుకూలమైన రవాణా సాధనంగా ఉండేది, అటువంటి కంపెనీలు భారత రూపాయికి విలువ ఇచ్చాయి.

ఆ సమయంలో దుబాయ్, అబుదాబి వంటి నగరాలు బ్రిటిష్ ఇండియా ట్రూషియల్ స్టేట్స్‌లో భాగంగా ఉండేవి. చాలా కాలం పాటు, వాటిని ఢిల్లీ నుంచే పరిపాలించారు. బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి బ్రిటిష్ పరిపాలకులు షార్జా, అబుదాబి, చుట్టుపక్కల ప్రాంతాలతో సముద్ర వాణిజ్యాన్ని పర్యవేక్షించారు. ఆ టైంలో ఈ దేశాలలో ఇండియన్ రూపాయిని అధికారిక కరెన్సీగా ఉపయోగించారు. ఈ దేశాలకు పాస్‌పోర్ట్‌లను కూడా భారతదేశం నుంచే జారీ చేసే వారు. ఇది ఒకప్పటి భారతీయ రూపాయి విలువ. అంతటి గొప్ప చరిత్ర కలిగిన రూపాయి.. ఈ రోజు చారిత్రక పతనావస్థకు చేరుకుంది. ఈ పతనావస్థకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Rishab Shetty: వైరల్‌గా మారిన కాంతార హీరో ‘ఇన్‌స్టా’ స్టోరీ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gulf Rupee
  • Hajj Notes.
  • History of Indian Currency 1966
  • indian currency
  • Indian Rupee

తాజావార్తలు

  • Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!

  • Tollywood: టాలీవుడ్‌కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?

  • Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • Youth: 4 రోజుల్లో 3.73 కోట్లు సాధించిన యూత్

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions