NTV Telugu Site icon

MP Gorantla Madhav: సీఎం నిర్ణయం తీసుకోలేదు.. ఎమ్మెల్యే అవుతా.. ఎంపీ అవుతానని నేను ఎలా చెబుతా..?

Gorantla Madhav

Gorantla Madhav

MP Gorantla Madhav: సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా.. ఎంపీని అవుతానని ఎలా చెబుతా..?ను అంటూ ఎదురు ప్రశ్నించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ టికెట్లు నిర్ణయిస్తారు.. అన్ని కులాలను గుర్తు పెట్టుకుని, అభ్యర్థి బలాలు బేరీజువేసుకుని టికెట్లు ఇస్తారని తెలిపారు. అయితే, నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం సీఎం జగనే నిర్ణయిస్తారు.. నేనెలా చెబుతాను? అని ప్రశ్నించారు.

Read Also: Pawan Kalyan: కాకినాడపై స్పెషల్‌ ఫోకస్‌.. పవన్‌ కల్యాణ్‌ పర్యటన పొడిగింపు

నేను రాజకీయాల్లోనే ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేయనని ఎలా చెబుతాను? అని ప్రశ్నించారు గోరంట్ల మాధవ్.. నా విషయంలో సీఎం జగన్ నిర్ణయమే తీసుకోలేదు.. సీఎం నిర్ణయం తీసుకోనప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా.. ఎంపీని అవుతానని ఎలా చెబుతా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఎక్కడినుంచి పోటీ చేయాలనే విషయంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే, నిన్న పిలిపిస్తే వచ్చా.. చిన్న పనులు ఉంటే వాటి విషయమై మాట్లాడాను.. కానీ. సీఎం జగన్ ను నేను కలవలేదన్నారు. నా సీటు విషయమై చర్చే జరగలేదు, ఇంకా క్లారిటీ రాలేదన్నారు. నిర్ణయానికి మూడు, నాలుగు రోజులు సమయం తీసుకుంటారని అనుకుంటున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. టికెట్ల గురించిన చర్చ జరుగలేదు.. నాకు ఎటువంటి పిలుపు రాలేదన్నారు. సామాజిక సాధికారతలో భాగంగా సీఎం జగన్ మార్పులు చేస్తున్నారని తెలిపారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.