Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) హిందీ విభాగం ప్రొఫెసర్ ఎన్. సత్యనారాయణ ఉన్నట్టుండి మాటమార్చారు.. గతంలో 1400 పీహెచ్‌డీ పట్టాలను వర్సీటీ అధికారులు అమ్ముకున్నారంటూ సంచలన కామెంట్స్ చేసిన ప్రొఫెసర్ సత్యనారాయణ.. ఇప్పుడు ఏయూ నాకు తల్లిలాంటిది అంటున్నారు.. హిందీ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న నల్లా సత్యనారాయణ.. ఏయూలో పీహెచ్‌డీ సీట్లు అమ్ముకున్నారని నేను స్వయంగా అనలేదన్నారు.. నాకు విద్యతో పాటు ఏయూ అన్ని ఇచ్చిందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నాకు మాతృమూర్తితో సమానం.. ఏయూలో పీహెచ్‌డీ అమ్ముకున్నారని పలువురు కరపత్రాలు వేసి ప్రచారం చేస్తున్నారని మాత్రమే చెప్పాను అని క్లారిటీ ఇచ్చారు.. దీనిని వక్రీకరిస్తూ ఏయూలో పీహెచ్‌డీ అమ్ముకుంటున్నారని నేను అన్నట్లు ప్రచారం జరిగిందన్నారు సత్యనారాయణ.
Read Also: Shruti Hasan : బ్లాక్ డ్రెస్ లో మెరిసిన శృతి హాసన్.. కిల్లింగ్ పోజులతో మతిపోగొట్టిందిగా..
మరోవైపు.. గతంలో నాపై వచ్చిన లైంగిక ఆరోపణలు అవాస్తవం.. పీహెచ్‌డీ థీసీస్ కు సంబంధించిన చిన్న వివాదాన్ని కొందరు పక్కవారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ సత్యనారాయణ. ఏయూ ప్రతిష్టకు భంగం వాటిల్లడం నాకు ఇష్టం లేదు.. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు నాకు తీవ్ర మనోవేదన కలిగించాయన్నారు ఏయూ హిందీ విభాగం ప్రొఫెసర్ నల్లా సత్యనారాయణ. కాగా, ఆ మధ్య ఏయూలో పీహెచ్‌డీల విక్రయాలు అంటూ పెద్ద రచ్చ జరిగింది.. హిందీ ప్రొఫెసర్ సత్యనారాయణ.. తనకు హీహెచ్‌డీ రాకుండా చేస్తున్నారని.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయగా.. గతంలో ఆ వ్యవహారంపై ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆరోపణలు చేస్తున్నమహిళ భర్త యూనివర్శిటీలో మద్యం వ్యాపారం చేస్తారట. ఆయనకు అర్హత లేకపోయినా ఓ ఉద్యోగం కల్పించారని.. ఆయన పీహెచ్‌డీలు అమ్మి పెట్టే వ్యాపారం చేస్తున్నారని.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు 1400 పీహెచ్‌డీలు అమ్మకానికి ఉన్నాయని అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.. హీహెచ్‌డీ చేసేసినట్లుగా సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తే.. పెట్టనందుకే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని సత్యనారాయణ చెప్పుకొచ్చిన విషయం విదితమే.