NTV Telugu Site icon

High Tension: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హైటెన్షన్.. ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే వెలిసిన గుడిసెలు

Janagama

Janagama

High Tension: జనగామ జిల్లాలోని బచ్చన్న పేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గుడిసెలు వెలిశాయి. బచ్చన్నపేట మండల కేంద్రంలోని గోపాల్ నగర్ సర్వే నెంబర్ 174 లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ గుడిసెలు వెలవడంతో.. వాటిని తొలగించడానికి భారీగా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. గుడిసె వాసులతో ఏసీపీ అంకిత్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. వెంటనే గుడిసెలు తీసివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడిసెలు తీసి వేసే ప్రసక్తే లేదని గుడిసె వాసులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమకు ఇంటి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గుడిసె వాసులు డిమాండ్ చేశారు.

Read Also: Financial Fraud : షాకింగ్.. మూడేళ్లలో 47శాతం మంది యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలకు గురయ్యారు

దీంతో ప్రభుత్వ భూమిలో అక్రమంగో గుడిసెలు వేసి అతిక్రమకు పాల్పడ్డారని ఏసీపీ పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోపాల్ నగర్ లోని సర్వే నెంబర్ 174 దగ్గర పోలీసులు మోహరించారు. ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం చేసుకోవాలని ఏసీపీ అంకిత్ కుమార్ చెప్పుకొచ్చారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.