NTV Telugu Site icon

Tension: చంద్రగిరిలో కొనసాగుతున్న హైటెన్షన్.. 144 సెక్షన్ అమలు..!

Chandragiri

Chandragiri

TDP- YCP Leaders Fight: తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గుర పోలీసులు భారీ భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఈ రోజు సాయంత్రం డిశార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే, మహిళా యూనివర్సిటీ దగ్గర వైసీపీ నేతల దాడిలో గాయపడిన పులివర్తి నాని, గన్ మ్యాన్ ధరణి కోలుకున్నారు. అయితే, పులివర్తి నాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ ఢిల్లీరాణి భర్త భాను ప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి ప్రధాన నిందితులుగా గుర్తించారు.

Read Also: SSMB29:మహేష్ స్టన్నింగ్ లుక్ అదిరిపోయిందిగా..

ఇక, పులివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం. వెంటనే అరెస్ట్ చేయకపోతే చంద్రగిరిని దిగ్భందిస్తామని పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హెచ్చరించింది. దీంతో పులివర్తి సుధారెడ్డి వార్నింగ్ తో చంద్రగిరిలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీతో మాట్లాడి, ఎన్నికల కమిషన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు.