తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గుర పోలీసులు భారీ భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. లివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం. వెంటనే అరెస్ట్ చేయకపోతే చంద్రగిరిని దిగ్భందిస్తామని పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హెచ్చరించింది.