High Tension at Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను అడ్డుకున్నారు పోలీసులు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దుబాయ్ కరిముల్లా పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు ఆరోపిస్తున్నారు ఆమె.. గత రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యపై కామెడీ మీమ్స్ సభలో వేయడంపై సౌమ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.. దుబాయ్ కరిముల్లా పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సౌమ్య..
Read Also: Supreme Court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
అయితే, కేసు నమోదు చేయకుండా పోలీసులు మూడు రోజులుగా తాత్సారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య.. టీడీపీ నేతలతో కలిసి కరిముల్లా ఇంటికి బయల్దేరారు.. దీంతో, వైసీపీ నేత ఇంటికి బయలు దేరిన మాజీ ఎమ్మెల్యే సౌమ్యను, టీడీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. ఇక, పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే సౌమ్య, ఆచంట సునీత, టీడీపీ శ్రేణులు. దీంతో.. నందిగామ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలకు పోలీసులు సర్దిచెప్పే సమయంలో.. మాటా మాటా పెరిగి.. టీడీపీ శ్రేణుల, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..