High Court will Today Verdict on munugode voter list
మునుగోడు ఓట్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్ మేరకు ఈ విచారణ జరుగనుంది. అయితే.. మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో భారీగా ఓటుహక్కు కోసం అప్లై చేశారని పిటిషన్, జులై 31వరకు మాత్రమే ఓటర్ లిస్ట్ నే పరిగణనలోకి తీసుకునే విధంగా ఆదేశించాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో.. ఫార్మ్ 6 కింద అప్లై చేసుకున్న వారిలో ఫేక్ ఓటర్స్ ఉన్నారు అని పిటిషన్‌లో పేర్కొంది బీజేపీ. అతి తక్కవ టైంలో 25 వేల దరఖాస్తులు చేసుకున్నారన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే.. ఈ మేరకు నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలవరించనుంది. ఈ నెల 14 తుది ఓటర్ లిస్ట్‌ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ప్రత్యర్థులపై విమర్శలు, సవాళ్లు విసురుతూ ఆయా పార్టీల నేతలు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికకు వచ్చే నెల 3న పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.