Site icon NTV Telugu

High Court : రేవంత్‌కు వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటి..?

High Court Revanth Reddy

High Court Revanth Reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓఆర్ఆర్ లీజు టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓఆర్ఆర్ టెండర్ వివరాలను తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా సంప్రదిస్తే అందుకు సమాధానం రావడం లేదని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రేవంత్ కు వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. అంతేకాకుండా.. ఓఆర్ఆర్ టెండర్ల వివరాలు అడిగితే ఓ ఎంపీకి ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకని.. ప్రతిపక్షాలకు డీటెల్స్ ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Also Read : Minister RK Roja: పవన్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నీ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి

ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వివరాలు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆర్టీఐ ని కోరారు. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో.. రేవంత్హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన పిటిషన్ని స్వీకరించిన కోర్టు జులై 28న ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో ఆయనకు ఓఆర్ఆర్డీటెల్స్ అన్ని సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలిపారు.

Also Read : Teacher Suspended: విద్యార్థులతో క్లాస్‌రూమ్‌లో మసాజ్ చేయించుకున్న టీచర్ సస్పెండ్

Exit mobile version