Site icon NTV Telugu

High Court: ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Mlc Anantha Babu

Mlc Anantha Babu

High Court: ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసులో తీర్పును రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హత్యకుగురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు.. ఈ కేసులో హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు జరిగాయి.. ఎమ్మెల్సీ అనంత్ బాబు తరుపున ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.. అయితే, ప్రభుత్వం తరుపు న్యాయవాదికి పలు ప్రశ్నలను సంధించింది హైకోర్టు.. కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని ప్రశ్నించింది.. సీసీఫుటేజ్ లో ఉన్న వారిని ఎందుకు కేసులో చేర్చలేదు..? కేవలం అనంత్ బాబును మాత్రమే చేర్చడం ఏంటని ప్రశ్నించింది.

Read Also: IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా! ఎవరికీ సాధ్యం కాలె

మరోవైపు.. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదంటూ పిటిషనర్ తరుపు న్యాయవాది జాడ శ్రావణ్ వాదనలు వినిపించారు.. కేసును పోలీసులు నీరు గార్చే విధంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఎమ్మెల్సీ అనంత్ బాబు తరుపు సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు.. రఘు వాదనలు వినేందుకు అంగీకరించలేదు న్యాయస్థానం.. ఇప్పటికే, ఈ కేసు వివరాలు సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి ప్రభుత్వం సమర్పించింది.. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version