Site icon NTV Telugu

Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్‌ రావుకు హైకోర్టులో ఊరట..

Raghunandanrao

Raghunandanrao

మెదక్ ఎంపీ రఘునందన్‌ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2021లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మోడల్‌ కోడ్‌ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీడీవో దుబ్బ సత్యం ఫిర్యాదు మేరకు రఘునందన్‌ పై కేసు నమోదైంది. ఈ కేసును తాజాగా కోర్టు కొట్టేసింది.

READ MORE: Airtel: స్పేస్ ఎక్స్‌‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్..

ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణం చెందిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అక్కడ 2021లో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. సాగ‌ర్ ప్రజ‌లు కారుకు విజయాన్ని అందించారు. నోముల భ‌గ‌త్ 18,872 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Exit mobile version