High Court Questioned Central Government: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21న జరగనుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా వీడియోలు సృష్టించి అప్‌లోడ్ చేస్తున్నారని, వాటి ద్వారా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. డీప్‌ఫేక్‌ల వినియోగం పెరిగిపోయిందని, అందుకే వాటిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఆలోచించాలి.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా అని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇంకా కమిటీ వేయకపోతే కోర్టు కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. అనంతరం కేంద్రం తరఫున హాజరైన ఏఎస్‌జీ చేతన్ శర్మ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దీనిని పరిశీలిస్తోందని చెప్పారు. ఈ విషయం సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం సమాచారాన్ని బహిరంగపరచలేమని చేతన్ శర్మ అన్నారు. అప్పుడు కోర్టు కమిటీ గురించి అంతా చెప్పొద్దని, అయితే దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలని అన్నారు. దీనిపై మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
ఈ అంశంపై చట్టం చేయడాన్ని పరిశీలించాలని ఆగస్టు 26న హైకోర్టు కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇది ప్రపంచ సమస్య అని, తక్షణమే దృష్టి సారించాలని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు.