NTV Telugu Site icon

Sandeep Lamichhane: రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు ఊరట.. నిర్దోషిగా తేల్చిన హైకోర్టు

Sandeep

Sandeep

అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే నిర్దోషి అని తేలింది. సందీప్ లామిచానేపై దాఖలైన అత్యాచారం కేసులో పటాన్ హైకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్‌ తరుఫున ఆడనున్నాడు. పటాన్ హైకోర్టు అధికార ప్రతినిధి తీర్థరాజ్ భట్టారాయ్ ప్రకారం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ బెంచ్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. కాగా.. లమిచానేకు ఈ ఏడాది ప్రారంభంలో ఖాట్మండు జిల్లా కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. రూ. ఐదు లక్షల జరిమానా విధించింది. సందీప్‌ ఓ యువతి అత్యాచారానికి పాల్పడ్డాడని.. 2022 జనవరి 10న జస్టిస్ శిశిర్ రాజ్ ధాకల్‌తో కూడిన సింగిల్ బెంచ్ అతన్ని దోషిగా నిర్ధారించింది.

Kia EV: త్వరలో కియా నుంచి 4 మోడల్స్ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్..

కాగా.. జిల్లా కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్రికెటర్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత 2023 నవంబర్ 4న ఖాట్మండు జిల్లా కోర్టు క్రికెటర్‌ను కస్టడీకి తీసుకుని విచారణ తర్వాత సుందరాలోని సెంట్రల్ జైలుకు పంపాలని ఆదేశించింది. కానీ, 2024 జనవరి 12న హైకోర్టు న్యాయమూర్తులు ధృవరాజ్ నందా, రమేష్ ధాకల్ విచారణ కొనసాగుతుండగానే బెయిల్‌పై విడుదల చేశారు. బెయిల్ పై విడుదలకు రూ.20 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే, కోర్టు అతనిని విదేశాలకు వెళ్లకుండా నిషేధించింది. అతను ఖాట్మండు నుండి బయటకు వెళితే మొదట పోలీసులకు తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు.. విదేశీ ప్రయాణాలపై నిషేధం ఉండటంతో లమిచానే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 27న జస్టిస్ సప్న ప్రధాన్ మల్లా, కుమార్ చుడల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ క్రికెట్ ఆడేందుకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.