Sandeep Lamichhane: రేప్ కేసులో నేపాల్ క్రికెటర్‌కు ఊరట.. నిర్దోషిగా తేల్చిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే నిర్దోషి అని తేలింది. సందీప్ లామిచానేపై దాఖలైన అత్యాచారం కేసులో పటాన్ హైకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ తరుఫున ఆడనున్నాడు. పటాన్ హైకోర్టు అధికార ప్రతినిధి తీర్థరాజ్ భట్టారాయ్ ప్రకారం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ బెంచ్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. కాగా.. లమిచానేకు ఈ ఏడాది ప్రారంభంలో ఖాట్మండు జిల్లా కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. రూ. ఐదు లక్షల జరిమానా విధించింది. సందీప్ ఓ యువతి అత్యాచారానికి పాల్పడ్డాడని.. 2022 జనవరి 10న జస్టిస్ శిశిర్ రాజ్ ధాకల్‌తో కూడిన సింగిల్ బెంచ్ అతన్ని దోషిగా నిర్ధారించింది.
Kia EV: త్వరలో కియా నుంచి 4 మోడల్స్ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్..
Also Read
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
కాగా.. జిల్లా కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్రికెటర్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత 2023 నవంబర్ 4న ఖాట్మండు జిల్లా కోర్టు క్రికెటర్‌ను కస్టడీకి తీసుకుని విచారణ తర్వాత సుందరాలోని సెంట్రల్ జైలుకు పంపాలని ఆదేశించింది. కానీ, 2024 జనవరి 12న హైకోర్టు న్యాయమూర్తులు ధృవరాజ్ నందా, రమేష్ ధాకల్ విచారణ కొనసాగుతుండగానే బెయిల్‌పై విడుదల చేశారు. బెయిల్ పై విడుదలకు రూ.20 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే, కోర్టు అతనిని విదేశాలకు వెళ్లకుండా నిషేధించింది. అతను ఖాట్మండు నుండి బయటకు వెళితే మొదట పోలీసులకు తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు.. విదేశీ ప్రయాణాలపై నిషేధం ఉండటంతో లమిచానే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 27న జస్టిస్ సప్న ప్రధాన్ మల్లా, కుమార్ చుడల్లతో కూడిన డివిజన్ బెంచ్ క్రికెట్ ఆడేందుకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
తాజావార్తలు
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!