Site icon NTV Telugu

Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!

Hey Balwanth

Hey Balwanth

Hey Balwanth: వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో సుహాస్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫేమ్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే బ‌ల్‌వంత్‌’. గోపి ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో మార్చి 31 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

READ ALSO: Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

కథా నేపథ్యం ఏమిటంటే..
గుంటూరు నేపథ్యంలో సాగే ఈ కథలో కృష్ణ (సుహాస్) అనే యువకుడికి తన తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలనే ఆశ ఉంటుంది. అయితే, తన తండ్రి రావు బల్వంత్ (వి.కె. నరేష్) చేసే అసలు బిజినెస్ ఏంటో తెలిసి కృష్ణ షాక్‌కు గురవుతాడు. మరోవైపు ఎన్‌జీఓ నడిపే మిత్ర (శివానీ నాగరం)తో ప్రేమలో ఉంటాడు. తండ్రి బిజినెస్ విషయం తెలిస్తే తన ప్రేమ ఏమవుతుందో అని కృష్ణ పడే ఇబ్బందులు, తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, వీటి చుట్టూ అల్లుకున్న కడుపుబ్బ నవ్వించే కామెడీయే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. జీ5లో ‘హే బల్వంత్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

READ ALSO: Spider-Man: రికార్డుల మోత మోగిస్తున్న స్పైడర్ మ్యాన్.. ఒక్క ట్రైలర్‌కే 100 కోట్ల వ్యూస్!

Exit mobile version