Spider-Man: రికార్డుల మోత మోగిస్తున్న స్పైడర్ మ్యాన్.. ఒక్క ట్రైలర్‌కే 100 కోట్ల వ్యూస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spider-Man: గ్లోబల్ సూపర్ హీరో ‘స్పైడర్ మ్యాన్’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి తెలిసింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్కును దాటి అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అలరించనున్నాడు. అతనికి జోడీగా జెండయా నటిస్తుండగా.. జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా మార్క్ రుఫలో (హల్క్) ప్రస్తావన ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Also Read
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
- Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. భారతదేశంలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అన్ని ప్రీమియం ఫార్మాట్లలో (IMAX, 3D, 4DX) స్పైడర్ మ్యాన్ సందడి చేయనున్నాడు. గత చిత్రాల రికార్డులను తిరగరాస్తూ, ఈ ‘బ్రాండ్ న్యూ డే’ ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందోనని సినీ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
READ ALSO: Iran Missile Man: అమెరికానే అల్లాడిస్తున్న ఇరాన్ ‘మిస్సైల్ మ్యాన్’.. ఇరాన్ రాకెట్లకు ‘బాస్’ ఇతనే?
తాజావార్తలు
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!