Sreeleela: పెళ్లి సందడి హీరోయిన్ ఓ థియేటర్లో టిక్కెట్లు అమ్మడంతో కొనేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల. తన అందం, అభినయంతో టాలీవుడ్ దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు గడుస్తున్నా శ్రీలీల మరో తెలుగు సినిమాలో నటించలేదు. మాస్ మహారాజా రవితేజతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ధమాకా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ శ్రీల హైదరాబాద్ లో సందడి చేసింది. నగరంలోని ఓ థియేటర్‌లో ధమాకా అడ్వాన్స్ టికెట్లు అమ్మి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీలీలను చూసిన ఫ్యాన్స్ ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
Read Also: Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా రవితేజ, శ్రీలలతో పాటు చిత్రబృందమంతా నగరమంతా పర్యటిస్తోంది. శ్రీలీల కూడా ఓ థియేటర్‌లో సందడి చేసింది. మొదట అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. ఆతర్వాత ఏకంగా టికెట్ కౌంటర్‌లో కూర్చుని టికెట్లు అమ్మింది. హీరోయిన్ టికెట్ కౌంటర్లో ప్రత్యక్షం కావడంతో అభిమానులు టికెట్లు కొనేందుకు భారీగా ఎగబడ్డారు. కాగా త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వం వహిస్తోన్న ధమాకా సినిమాలో జయరాం, తనికెళ్ల భరణి, సచిన్ ఖేడ్కర్, రావు రమేశ్, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రా లోకేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు.
Read Also: Anushka Shetty: యంగ్ కుర్రాడితో ప్రేమలో పడిన అనుష్క.. వివరాలివే
Mind Nunchi povatle #Sreeleela #Dhamaka ❤ 😍 💖 ❣ 💕 pic.twitter.com/EKd6zXRovh
— MehRRRaj (@mdgouse13116) December 17, 2022