NTV Telugu Site icon

KA Movie: రాధా- సత్యభామలు చెప్పిన “క” కథా కమామిషు

Kaa Move

Kaa Move

కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ‌”క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ‌”క” సినిమా ట్రైలర్ ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా “క” మూవీ ట్రైలర్ చాలా బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. మరో నాలుగు రోజులే ఉంది సినిమా రిలీజ్ కు . చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒక వారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తమిళనాట థియేటర్స్ దొరకలేదు, మలయాళంలో దుల్కర్ లక్కీ భాస్కర్ సేమ్ డేట్ కి రిలీజ్ అవుతోంది.

READ MORE: Nellore: జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై మంత్రులు రివ్యూ..

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. “సినిమా హీరో నేను ఆయ్ సినిమాలో నటిస్తున్న టైమ్‌లో నా ఫొటోస్ ఇండస్ట్రీలో ఫిలింమేకర్స్ దగ్గరకు సర్క్యులేట్ అయ్యాయి. అలా “క” సినిమా అవకాశం నా దగ్గరకు వచ్చింది. గం గం గణేశాలో మోడరన్ గా ఉంటాను. ఆయ్ సినిమాలో ట్రెడిషనల్ గా కనిపిస్తా. ఆయ్ లో పల్లవి క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. ఆ పాత్రకు భిన్నమైన రోల్ చేయాలని కోరుకున్నా. అనుకున్నట్లుగానే “క” సినిమాలో సత్యభామ పాత్ర దక్కింది. కిరణ్ అబ్బవరంతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నా సత్యభామ క్యారెక్టర్ లుక్ కోసం సావిత్రి గారి లుక్ ను రిఫరెన్స్ గా తీసుకున్నారు. అందుకే హీరో నేను సావిత్రిలా ఉన్నానని డైలాగ్ చెబుతాడు. సావిత్రి గారిలా నేను గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ల సీన్ చేయగలను. ఆమె మహానటి చూసి చాలా ఇన్స్ పైర్ అయ్యాను. నా సత్యభామ క్యారెక్టర్ ను సావిత్రి గారిలా ఉన్నానని హీరో చెప్పే డైలాగ్ చాలా రిలవెంట్ గా ఉందని డైరెక్టర్స్ అన్నారు. మా డైరెక్టర్స్ సందీప్ సుజీత్ ఇద్దరూ ఒకే థాట్ ప్రాసెస్ తో ఉండేవారు. వాళ్లు ఎక్కడా డిఫరెన్స్ రాకుండా బాగా మూవీని తెరకెక్కించారు.” అని పేర్కొంది.

READ MORE: Sonam Kapoor: వెరైటీ ఆభరణాన్ని ధరించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్..

హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ.. “నేను తెలుగులో నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమాలో నటించాను. ఆ సినిమా కథలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించాను. ఒక సినిమా సెలెక్ట్ చేసుకునే ముందు నా క్యారెక్టర్ కథలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటాను. హీరోయిన్ గానే కనిపించాలని అనుకోవడం లేదు. ఈ సినిమాలో రాధ అనే క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ సందీప్ నాకు ఫోన్ లో కొంత నెరేషన్ ఇచ్చారు. నేను పూర్తిగా వినాలని చెబితే కంప్లీట్ స్క్రిప్ట్ నా క్యారెక్టర్ తో సహా చెప్పారు. రాధ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. వెంటనే ఒప్పుకున్నాను. రాధ ఒక స్కూల్ టీచర్. అభినయ వాసుదేవ్, సత్యభామ ఒక టైమ్ ఫ్రేమ్ లో కనిపిస్తే, నేను మరో పీరియడ్ లో కనిపిస్తా. నా పాత్రకు వారి పాత్రలకు మధ్య కనెక్షన్ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. సత్యభామ పాత్రతో నాకు సీన్స్ ఉండవు. క సినిమా రిలీజ్ అయ్యాక నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నా. ఇప్పుడే చెబితే థ్రిల్ రివీల్ అవుతుంది.” అని తెలిపింది.

Show comments