Vijay: మంచి మనసు చాటుకున్న హీరో విజయ్.. విద్యార్థులకు ప్రోత్సాహం
- మంచి మనసు చాటుకున్న హీరో విజయ్.. విద్యార్థులకు ప్రోత్సాహం
- గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహం
- పదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు ప్రోత్సాహం
- సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన.. ప్రోత్సాహం
- విద్యార్థులకు ప్రశంసా పత్రం.. రూ. 5000 ప్రోత్సాహకం అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కష్టం అంటే ఆదుకోవడానికి టివికే పార్టీ అధినేత, కోలీవుడ్ హీరో విజయ్ ముందుంటారు. అలాగే ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ఆయనకు ఆనే సాటి. తలపతి విజయ్ అందించే సామాజిక సేవ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన నాటి నుంచి.. ఇప్పటివరకు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. సినిమాల్లో, రాజకీయాల్లో గొప్ప మనసున్న సేవా తత్పరుడు అని ముద్ర వేసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల వచ్చిన పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందిస్తున్నారు విజయ్. గడిచిన సంవత్సరం ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థినికి విజయ్ డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
Read Also: Vijayawada: కుమార్తె కళ్లెదుటే తండ్రిని చంపేసిన ప్రేమోన్మాది
Also Read
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! 'క్లబ్‌లోకి స్వాగతం' అంటూ..
ఈ క్రమంలో.. కొందరు విద్యార్థులతో హీరో విజయ్ ఇంట్రాక్ట్ అయ్యారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు హీరో విజయ్. తిరువాన్మియూర్లోని శ్రీరామచంద్ర కళ్యాణమండపంలో పదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన, ప్రోత్సాహాన్ని పార్టీ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో.. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెంకాసి, విరుదునగర్, మదురై, పుదుకోట్టై, అరియలూర్, కోయంబత్తూరు, రామనాథపురం, దిండిగల్, శివగంగై, ఈరోడ్, తేని, ధర్మపురి, కరూర్, కృష్ణగిరి, నమక్కల్, నీలగిరి, సేలం ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రం, రూ. 5,000 ప్రోత్సాహకం అందించారు.
Read Also: Road Accident: రోడ్ టెర్రర్.. ట్రక్కు-మినీ బస్సు ఢీ, 13 మంది దుర్మరణం
ఇక విజయ్.. ‘ది గోట్’ (The goat – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)తో బిజీగా ఉన్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విజయ్ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ వాడారు. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్’ సినిమా కోసం వర్క్ చేశారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!