కొందరు విద్యార్థులతో హీరో విజయ్ ఇంట్రాక్ట్ అయ్యారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు హీరో విజయ్. తిరువాన్మియూర్‌లోని శ్రీరామచంద్ర కళ్యాణమండపంలో పదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన, ప్రోత్సాహాన్ని పార్టీ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో.. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెంకాసి, విరుదునగర్, మదురై, పుదుకోట్టై, అరియలూర్, కోయంబత్తూరు, రామనాథపురం, దిండిగల్, శివగంగై, ఈరోడ్, తేని, ధర్మపురి, కరూర్, కృష్ణగిరి, నమక్కల్, నీలగిరి,…