NTV Telugu Site icon

Vijay: మంచి మనసు చాటుకున్న హీరో విజయ్.. విద్యార్థులకు ప్రోత్సాహం

Vijay

Vijay

కష్టం అంటే ఆదుకోవడానికి టివికే పార్టీ అధినేత, కోలీవుడ్‌ హీరో విజయ్‌ ముందుంటారు. అలాగే ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ఆయనకు ఆనే సాటి. త‌ల‌ప‌తి విజ‌య్ అందించే సామాజిక సేవ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన నాటి నుంచి.. ఇప్పటివరకు సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుంటారు. సినిమాల్లో, రాజ‌కీయాల్లో గొప్ప మ‌న‌సున్న సేవా త‌త్ప‌రుడు అని ముద్ర వేసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల వచ్చిన పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందిస్తున్నారు విజయ్‌. గడిచిన సంవత్సరం ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థినికి విజయ్‌ డైమండ్‌ నెక్లెస్‌ కానుకగా ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Read Also: Vijayawada: కుమార్తె కళ్లెదుటే తండ్రిని చంపేసిన ప్రేమోన్మాది

ఈ క్రమంలో.. కొందరు విద్యార్థులతో హీరో విజయ్ ఇంట్రాక్ట్ అయ్యారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు హీరో విజయ్. తిరువాన్మియూర్‌లోని శ్రీరామచంద్ర కళ్యాణమండపంలో పదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన, ప్రోత్సాహాన్ని పార్టీ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో.. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెంకాసి, విరుదునగర్, మదురై, పుదుకోట్టై, అరియలూర్, కోయంబత్తూరు, రామనాథపురం, దిండిగల్, శివగంగై, ఈరోడ్, తేని, ధర్మపురి, కరూర్, కృష్ణగిరి, నమక్కల్, నీలగిరి, సేలం ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రం, రూ. 5,000 ప్రోత్సాహకం అందించారు.

Read Also: Road Accident: రోడ్ టెర్రర్.. ట్రక్కు-మినీ బస్సు ఢీ, 13 మంది దుర్మరణం

ఇక విజయ్‌.. ‘ది గోట్‌’ (The goat – ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)తో బిజీగా ఉన్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడారు. ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’ సినిమా కోసం వర్క్‌ చేశారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు.