Suriya-Jyothika: 18 ఏళ్ల తర్వాత.. ఆఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌ హిట్‌ జోడీ!

Suriya Jyothika

Suriya Jyothika

After 18 Years Suriya and Jyothika to act a movie: కోలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో సూర్య‌, జ్యోతిక జంట ఒక‌టి. రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. పెళ్లికి ముందు సూర్య‌, జ్యోతికలు చాలా సినిమాల్లో నటించారు. 1999లో విడుదలైన ‘పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌’లో తొలిసారి కలిసి నటించారు. అనంతరం ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కాక్క, సిల్లన్ను ఒరు కాదల్, మాయావి లాంటి సినిమాలలో నటించారు. సూర్య‌, జ్యోతికల పరిచయం ప్రేమగా మారడంతో.. ఇరు కుటుంబాల అనుమతితో 2006లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.

పెళ్లి అనంతరం సూర్య‌ వరుస హిట్‌లతో దూసుకు పోగా.. జ్యోతిక మాత్రం నటనకు దూరమయ్యారు. ’36 వయదినిలే’ చిత్రంతో జ్యోతిక హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చారు. మమ్ముట్టికి జంటగా ‘కాదల్‌ ది కోర్‌’ అనే చిత్రంలో నటించారు. తాజాగా బాలీవుడ్‌లో అజయ్‌ దేవ్‌గన్‌ సరసన ‘సైతాన్‌’లో నటించారు. రీఎంట్రీలో సూర్య‌తో జతకట్టేందుకు జ్యోతిక సిద్ధమయ్యారని తెలుస్తోంది. బెంగుళూరు డేస్‌ ఫేమ్‌ అంజలి మేనన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్య‌, జ్యోతికలు జంటగా నటించనున్నారట. ప్రస్తుతం వీరిద్దరితో చిత్ర బృందం చర్చలు జరుపుతోందట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక మరోసారి జంటగా నటించనున్నారు.

Also Read: Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్‌ యువ హీరో.. ఫొటోస్ వైరల్!

సూరరైపోట్రు, జై భీమ్‌ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ప్రస్తుతం సూర్య‌ ‘కంగువ’ సినిమాని పూర్తి చేశాడు. ఇటీవలే దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజుతో 44వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో మొదలు కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సైంధవ్‌ ఫేమ్‌ సంతోష్‌ నారాయణన్‌ సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నాడు. పీరియాడిక్‌ వార్‌ అండ్‌ లవ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే సంక్రాతికి విడుదల కానుంది.