Hero Splender : దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్. ఈ బైక్ సామాన్యుల బైక్ గా పేర్గాంచింది. ధర కూడా సామాన్యుల బడ్జెట్లోనే ఉంటుంది. ఈ కారణంగా కూడా ఈ బైక్ కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ హీరో బైక్ కు అత్యంత ప్రజాదరణ ఉండడానికి ప్రధాన కారణం దాని మైలేజ్. హీరో స్ప్లెండర్ చాలా సంవత్సరాలుగా ప్రజల అభిమాన బైక్‌గా మార్కెట్లో నిలిచింది. ఈ హీరో బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.77,176 నుండి ప్రారంభమవుతుంది.
ఈఎంఐ పై హీరో స్ప్లెండర్ ఎలా కొనాలి?
ఢిల్లీలో హీరో స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్-అల్లాయ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 91,949. ఈ మోటార్ సైకిల్ ధర దేశంలోని వివిధ నగరాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఈ హీరో మోటార్ సైకిల్ కొనడానికి బ్యాంకు నుండి రూ. 87,400వరకు లోన్ వస్తుంది.
Read Also:Sankranthiki Vasthunam: రాజమండ్రిలో సందడి చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” యూనిట్
* హీరో స్ప్లెండర్ ప్లస్‌ను ఈఎంఐ పై కొనడానికి, దాదాపు ఆరు వేల రూపాయలు డౌన్ పేమెంట్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
* రెండేళ్ల లోన్ పై హీరో స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్-అల్లాయ్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే 24 నెలల పాటు బ్యాంకులో సమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఈ రుణంపై బ్యాంకు 9 శాతం వడ్డీని వసూలు చేస్తే, ప్రతి నెలా వాయిదాగా రూ.4,300 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
* ఈ హీరో మోటార్‌సైకిల్ కొనడానికి మూడు సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే రూ. 3,000 ఈఎంఐ కట్టాలి.
* హీరో స్ప్లెండర్ ప్లస్ కొనడానికి నాలుగు సంవత్సరాల పాటు లోన్ గనుక తీసుకుంటే ప్రతి నెలా రూ. 2,500 ఈఎంఐ కట్టాలి.
హీరో స్ప్లెండర్ ప్లస్ మైలేజ్
హీరో స్ప్లెండర్ ప్లస్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఓహెచ్ సీ ఇంజిన్ తో వస్తుంది. ఈ బైక్‌లోని ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9కిలో వాట్స్ శక్తిని, 6,000 rpm వద్ద 8.05న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హీరో మోటార్‌సైకిల్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. స్ప్లెండర్ ప్లస్ 9.8 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీని కలిగి ఉంది, అంటే ఈ బైక్ ఒకే ట్యాంక్ ను ఒక సారి పూర్తిగా నింపితే 686 కిలోమీటర్ల వరకు నడపుకోవచ్చు.
Read Also:EPFO ATM Card: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!