Sharwanand: సీనియర్ నటి కాళ్లు మొక్కిన హీరో శర్వానంద్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Tulasi on Sharwanand: ‘ఛార్మింగ్ స్టార్’ శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో శర్వా సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించారు. మనమే చిత్రం నేడు (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ నటి తులసి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.
మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీనియర్ నటి తులసి హాజరయ్యారు. ఆమె వైదిక పైకి రాగానే అయ్యప్ప మాల వేసుకున్న హీరో శర్వానంద్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శర్వాను తులసి హత్తుకున్నారు. ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శర్వా వినయంను అందరూ ప్రశంసిస్తున్నారు. మనమే సినిమాలో శర్వాకు తల్లిగా తులసి నటించారు. తులసి మాట్లాడుతూ… ‘శర్వా నా కడుపులో పుట్టలేదు కానీ.. నా కొడుకే. శర్వా గురించి అందరు విన్నవి, చెప్పుకుంటున్నవే నేను చెబుతున్నా. బ్రిలియంట్ యాక్టర్, వెరీ హార్డ్ వర్కర్, జెంటిల్ మ్యాన్, క్లాసీ జెంటిల్ మ్యాన్. ఎప్పుడూ అందరితో మనమే అంటూ కలిసిపోతాడు. శర్వాకు నిలకడ బాగా ఉంటుంది. ఇలానే ఉండు. ఇంకా పైకి ఎదుగుతావ్, నేను ఓ తల్లిగా చూస్తూనే ఉంటా’ అని అన్నారు.
Also Read
Also Read: Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
హీరోగా 35 సినిమాలు చేయడం చాలా కష్టం అని తులసి పేర్కొన్నారు. శర్వాకు విజయాలే ఎక్కువగా ఉన్నాయని, ఇది చాలా అరుదు అని అన్నారు. శర్వాలో ఉన్న ఓపిక ఈ తరం పిల్లలకు ఉండడం అరుదు అని తులసి ప్రశంసించారు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన శర్వాకు ‘గమ్యం’ బ్రేక్ ఇచ్చింది. ప్రస్థానం, రన్ రాజా రన్ చిత్రాలతో స్టార్ అయ్యాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజులో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. శతమానం భవతి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మహానుభావుడుతో మరో మెట్టు ఎక్కాడు. ఇటీవల పరాజయాలు రావడంతో మనమేపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!