NTV Telugu Site icon

Yarlagadda Venkat Rao: యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej

Sai Dharam Tej

Yarlagadda Venkat Rao: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ప్రచారంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ జన సైనికులకు జోష్ నింపారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మీ ఓటుని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు, మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి బాలశౌరికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మరోవైపు విజయవాడ రూరల్ బాపులపాడు మండలం మల్లవల్లి మాజీ ఎంపీటీసీ కొక్కిరాల సాంబశివరావు సమక్షంలో చేరిన 120 కుటుంబాలు టీడీపీ చేరాయి. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ , జనసేన , బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. గడపగడపకు తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు పాంప్లెట్ల ద్వారా ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు వివరిస్తున్నారు.

విజయవాడ రూరల్ కె. సీతారాంపురంలో యార్లగడ్డ సమక్షంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బాపులపాడు మండలం కే సీతారాంపురం  టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శివనాగరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చౌటుపల్లి భాగ్యరాజు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన దాదాపుగా 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి.