Ram Charan RC16: నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప నగరానికి బయలుదేరి వెళ్లారు. ఇక కడప చేరుకున్న రామ్ చరణ్ కు విమానాశ్రయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన రామ్ చరణ్ నేరుగా కడప నగరంలోని విజయదుర్గ దేవాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇకపోతే, అక్కడ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా విడుదల తర్వాత సెట్స్ పైకి వెళ్లే #RC 16 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పేపర్లను అమ్మవారి దగ్గర ఉంచి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రామ్ చరణ్ తేజ ఆ తర్వాత నగరంలోని పెద్ద దర్గాకు వెళ్లారు.
Also Read: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
ఇక ప్రస్తుతం జరుగుతున్న అమీన్‌పీర్ దర్గా 80వ నేషనల్ ముషాయిర గజల్ ఈవెంట్‌లో హీరో రామ్ చరణ్ తేజ్ పాల్గొన్నాడు. దర్గాకు చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గాలో ముషాయిర కార్యక్రమంలో రామ్ చరణ్ తేజ్ పాల్గొని చాదర్ సమర్పించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కడప నగరంలో విమానాశ్రయం నుంచి గుడికి వెళ్లే సమయంలో మెగా అభిమానుల కోలాహలం తారస్థాయికి చేరుకుంది. అడుగడుగున రామ్ చరణ్ తేజ్ కు మెహ అభిమానులు నీరాజనాలు పట్టారు.