Nani: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరో అయ్యాడు. ఇక తన సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. యాక్టింగ్ తోనే ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే నాని ‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు టాప్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. అన్ని రకాల ప్రేక్షకుల ఆదరణ పొందిన నాని.. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యన చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నానికి మంచి మార్కులు పడ్డాయి. కాగా నాని కెరీర్ లో ది బెస్ట్ సినిమాగా చెప్పుకునే ‘జెర్సీ’ సినిమాలో నాని యాక్టింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా స్టేషన్ సీన్ లో నాని జీవించేశాడు.
Read Also: NTR 30: శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు ఫిక్స్ ?
రాంచరణ్ తో సినిమా చేసే అవకాశాన్ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మిస్ చేసుకోవడంతో.. మరో కథను ఆయన సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాను తనకు బాగా కలిసి వచ్చిన నేచురల్ స్టార్ నానితో కలిసి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. వీరిద్దరు ఈ సినిమాకు ముందుకు వస్తే.. మరోసారి జెర్సీ కాంబో రిపీట్ అవడంతో పాటు సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడతాయి. అన్నీ కుదిరితే త్వరలోనే మరోసారి ఈ హిట్ కాంబో స్క్రీన్ మీద అద్భుతాన్ని సృష్టించే అవకాశం ఉంది.
Read Also: Priya Warrior : ఆ హీరో అంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్
తెలగులో నాని చేసిన ‘జెర్సీ’ని హిందీలో షాహిద్ కపూర్ చేసినా ఎందుకో అది అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రాణం పెట్టి చేశాడు. కథలో బలానికి తోడు, నాని యాక్టింగ్ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. అయితే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రాంచరణ్ తో కలిసి సినిమా చేయాలని భావించాడు. కానీ ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది.