YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. నాలుగు రోజుల షెడ్యూల్ ఇదే!

  • పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
  • రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు
  • సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు
Ys Jagan

Ys Jagan

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) నుంచి నాలుగు రోజుల పాటు (డిసెంబర్ 27) సొంత నియోజవర్గంలో జగన్‌ పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని.. దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోతారు.

24 షెడ్యూల్‌:
వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.

25 షెడ్యూల్‌:
ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించి.. పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు.

Also Read: PDS Ration Scam: డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!

26 షెడ్యూల్‌:
పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో వైఎస్‌ జగన్‌ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు.

27 షెడ్యూల్‌:
ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు.