NTV Telugu Site icon

Hemant soren: మరో మూడు రోజుల పాటు హేమంత్‌ సోరెన్‌ కస్టడీ పొడిగింపు

Hemanth Soren

Hemanth Soren

Jharkhand: భూకుంభకోణ సంబంధిత మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న అరెస్టైన ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు మరో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఇక, నిన్న (సోమవారం) ఆయన కస్టడీ ముగిసిన నేపథ్యంలో సోరెన్‌ను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. ఈడీ అధికారుల అభ్యర్థన మేరకు ప్రత్యేక కోర్టు మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది.

Read Also: Bangladesh Captain: షకీబ్‌ అల్‌ హసన్‌ బిజీ.. బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్‌!

అయితే, మరోవైపు తన అరెస్టును సవాల్‌ చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేసింది. సోరెన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఈ నెల 27న ఈ పిటిషన్‌పై తుది విచారణ చేపడతాం.. ఆలోపు ఏకీకృత అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Wedding Season : ఈ సీజన్‌లో 42 లక్షల పెళ్లిళ్లు.. రూ.5.5 లక్షల కోట్ల బిజినెస్ అంచనా

ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి సహాయకుడు భాను ప్రతాప్ ప్రసాద్, రెవెన్యూ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రాంగణంలో 17 ఒరిజినల్ రిజిస్టర్లతో పాటు 11 ట్రంక్‌ల నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాంచీ జిల్లాలోని బర్గై సర్కిల్‌లో అక్రమంగా ఆక్రమించిన 8.5 ఎకరాల స్థలంలో సోరెన్ బాంకెట్ హాల్ నిర్మించాలనుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.