NTV Telugu Site icon

Hemant soren: సుప్రీంలో హేమంత్ బెయిల్ పిటిషన్లు ఉపసంహరణ.. కారణమిదే!

Heme

Heme

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన ఇండియా కూటమి తరపున ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్‌ను జనవరిలో అరెస్ట్ చేసింది. అప్పటినుంచి ఆయన జైల్లో ఉన్నారు. వాస్తవాలను బహిర్గతం చేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. బెయిల్ పిటిషన్లు రద్దయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో ముందుగానే మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. హేమంత్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: AP CEO MK Meena: ఏ1 నిందితుడిగా పిన్నెల్లి.. పది సెక్షన్ల కింద కేసులు

మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కపిల్ సిబల్‌ను కోర్టు అనేక కఠినమైన ప్రశ్నలను అడిగింది. హేమంత్ ముఖ్యమంత్రిగా కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాల ద్వారా రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయల విలువైన భూమిని సంపాదించారని ఆరోపించింది. దీంతో  సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై సుప్రీం ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరిచుకున్నారు. దీంతో సోరెన్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో​ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్‌లో 14 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు దశల్లో ఏడింటికి పోలింగ్ పూర్తయింది. మిగిలిన ఆరు స్థానాలకు మే 25న, ఏడో స్థానానికి జూన్ 1న ఓటింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: Katrina Kaif : కత్రీనా కైఫ్ బేబీ బంప్స్ ఫొటోస్ వైరల్..