NTV Telugu Site icon

Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్

Dkeke

Dkeke

సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే పైలెట్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ప్రాణాలతో ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కాకపోతే ఛాపర్ దెబ్బతిన్నట్లుగా సమాచారం. ఎన్నికల ప్రచారానికి శివసేనకు చెందిన ఒక నేతను తీసుకెళ్లేందుకు వస్తుండగా మహారాష్ట్రలో ఈ ప్రమాదం జరిగింది.

శివసేన నాయకురాలు సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ అవుతుండగానే అకస్మాత్తుగా కూలిపోయిందని శుక్రవారం అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను అంధరే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఛాపర్ ఒక గుర్తు తెలియని ప్రదేశంలో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా ఓపెన్ గ్రౌండ్‌లో కూలిపోయిందని తెలిపారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ధూళి వ్యాపించింది. పెద్ద శబ్దంతో కుప్పకూలినట్లుగా వీడియోలో కనిపించింది. రాయ్‌గఢ్‌లోని మహద్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే హెలికాప్టర్ పైలట్ మాత్రం కిందకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

ఇది కూడా చదవండి: Uttarpradesh : భూ వివాదం ఇద్దరు అన్నదమ్ముల దారుణ హత్య.. ఇద్దరి పరిస్థితి విషమం

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఇక అందారే ఎన్నికల ప్రచారం కోసం కారులో వెళ్లిపోయారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రైవేట్ చాపర్లను ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. రాయ్‌గఢ్‌లో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.