Site icon NTV Telugu

Rain warning: తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Rain

Rain

తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ లిస్టు విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: IBPS RRB 2024: 10వేల ఉద్యోగాలు రెడీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పంజాబ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Sheikh Hasina: ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. ఘన స్వాగతం

Exit mobile version