NTV Telugu Site icon

Himachal Pradesh: స్తంభించిన జనజీవనం.. కాలువలో కొట్టుకుపోయిన వాహనాలు

Water

Water

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. గత 12 గంటలుగా కుండపోత వర్షాలు, భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు లాహౌల్‌ స్పీతి, చంబా-పాంగీ, కిన్నౌర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ మంచు కారణంగా రహదారులు మూసివేయబడ్డాయి. దీంతో ఈ ప్రాంతాలు మిగతా ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోయాయి. గత 24 గంటల్లో లాహౌల్‌ స్పీతి, కిన్నౌర్‌, చంబా, కాంగ్రా, కులు, మండీ, శిమ్లా జిల్లాల్లో భారీ మంచు కురిసింది. ప్రత్యేకంగా కులు, కాంగ్రాలో మేఘవిష్ఫోటనం కారణంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: Wife Harassment: భార్య వేధింపులు తట్టుకోలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా కిన్నౌర్, కులు, కాంగ్రా, చంబా జిల్లాల్లో కనిపించింది. అత్యధిక వర్షపాతం కూడా ఈ జిల్లాల్లోనే నమోదైంది. కులులో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పలు రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది. కులులోని భుంతర్‌ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో నది ఉప్పొంగింది. వర్షపు నీటితో నిండిపోయిన భుంతర్‌ సబ్జీ మార్కెట్‌ పూర్తిగా మునిగిపోయింది. భూత్‌నాథ్ బ్రిడ్జి వద్ద వాహనాలు వాగులో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల వల్ల లార్జీ డ్యామ్‌ నుంచి అధికంగా నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే బరోట్ ప్రాంతంలోని డ్యామ్ గేట్లు తెరవాల్సి వచ్చింది. మరోవైపు బడా బంగాల్ ప్రాంతంలో మేఘలు విస్ఫోటనం సంభవించి పలు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. హిమాచల్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో మంచు భారీగా పడుతోంది.

Read Also: DK Shivakumar: బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఆరోపణలపై డీకే.శివకుమార్ క్లారిటీ

వర్షపాతం, హిమపాతం కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు రహదారులు పూర్తిగా మూసివేయబడ్డాయి. ముఖ్యంగా చంబా, లాహౌల్‌ స్పీతి, కిన్నౌర్‌ ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంబంధం కోల్పోయాయి. ప్రభుత్వం, వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు. కులు, చంబా, కిన్నౌర్‌ వంటి హిమపాతం ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. విస్తృతంగా కురుస్తున్న వర్షాలు, హిమపాతం వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.