Bigg Boss 8 Grand Finale: నేడు బిగ్‌బాస్ 8 ముగింపు.. పోలీసుల భారీ బందోబస్తు!
- నేడు బిగ్‌బాస్ సీజన్ 8కు ఎండ్ కార్డ్
- అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తు
- ప్రధాన పోటీ ఇద్దరి మధ్యనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
గత ఏడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7 విజేతను ప్రకటించారు. విజేత పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చాక అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. అభిమానుల కారణంగా ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా.. పోలీసులు ముందస్తుగా స్టూడియో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 300 మంది పోలీసులు స్టూడియో వద్ద చుట్టుపక్కల ఉండనున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
సీజన్ 8లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మెయిన్ కంటెస్టెంట్లు 14 మంది, వైల్డ్ కార్ట్ ఎంట్రీలతో 8 మంది షోలో పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్‌కు చేరుకున్నారు. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్, అవినాష్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్, నిఖిల్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. మరి విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!