Site icon NTV Telugu

Heavy Rains in Krishna District: కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు.. తెలంగాణకు నిలిచిన రాకపోకలు

Rain

Rain

Heavy Rains in Krishna District: వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. ఒడిశా తీరాన్ని అనుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది.. అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా విస్తరించింది రుతుపవన ద్రోణి… దీని ప్రభావంతో.. రాగాల ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ వర్షాల ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. జగ్గయ్యపేటలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో వరి, పత్తి, పొలాలు నీట మునిగాయి. కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో పెనుగంచిప్రోలు నుండి తెలంగాణ మధిరకు రాకపోకలు నిలిచాయి.

Read Also: Kattaleru Vagu: కట్టలేరు వాగుకు మళ్లీ పోటెత్తిన వరద.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్..!

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈరోజు ఉదయం ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. నల్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో నందిగామ – చందర్లపాడు మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక, మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు వద్ద ఏనుగు గడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో చిలుకూరు, దాములూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏనుగు గడ్డ వాగుకు పై ప్రాంతాల నుండి నీరు అధికంగా వస్తుండటంతో చిలుకూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నంకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: Building Collapse: మహారాష్ట్రలో భవనం కూలి 15 మంది మృతి, బిల్డర్ అరెస్ట్

అవనిగడ్డలో హంసలదీవి బీచ్ గేట్లు మూసేసారు. ఎడ్లంక గ్రామాన్ని నేడు సెంట్రల్ వాటర్ కమిషన్ సందర్శించనుంది. కృష్ణా వరదల ఉధృతికి ప్రమాదకర స్థాయిలో ఎడ్లంక గ్రామం కోతకు గురవుతోంది. ఎడ్లంక గ్రామ కోతపై హోమ్ మంత్రి అనితను, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ప్రకాశ్ జైన్ ను కలసి సమస్యను స్థానిక తెలుగుదేశం నేత బొబ్బా గోవర్ధన్ వివరించారు. తక్షణం స్పందించిన హోమ్ మంత్రి నివేదిక గ్రామంలో పరిస్థితుల అధ్యయనంను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. కోత నివారణపై అధ్యయనం చేసేందుకు ఈ సాయంత్రం ఎడ్లంకకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు రానున్నారు. మరోవైపు నూజివీడులో అకాల వర్షానికి ప్రధాన ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు.

Exit mobile version