దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వర్షం దెబ్బకి నానా అవస్థలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రభావంతో అస్థవ్యస్థం అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరోసారి భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది.
Read Also: Jaanavule Lyrical Video: తమన్ ‘జాణవులే’ అంటుంటే బాగుంది ‘బ్రో’!
కాగా, దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
Read Also: Minister KTR: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ కావాలో.. రైతులే చెప్పాలి..
అదేవిధంగా కొన్ని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోనూ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే.. ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు భారీగా వానాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అదికారులు పలు సూచనలు జారీ చేసింది.