NTV Telugu Site icon

CM Revanth: తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

Ts Rains

Ts Rains

ఈరోజు హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

CMD Musharraf Ali Faruqui: సాధారణ ప్రజలు, వినియోగదారులు అప్రమత్తంగా వుండండి..

మరోవైపు.. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో వర్షం కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై కమిషనర్ రోనాల్డ్ రోస్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేయాలని వచ్చిన ఫిర్యాదులను వెంటనే రెక్టిఫై చేయాలని ఆదేశించారు. కార్యాలయాల నుండి వెళ్లాల్సిన ఉద్యోగులు కొంత ఆలస్యంగా బయలుదేరాలని సూచించారు. అత్యవసరం ఉంటేనే సిటిజన్స్ బయటకి రావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

IPL 2024: సన్ రైజర్స్-గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే..?

కాగా.. జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.